Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేరళ, అసోం, పుదుచ్చేరిలో రేపే పోలింగ్
posted on: Apr 8, 2026 3:51PM
.webp)
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఘట్టం అంటే మూడు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 9) పోలింగ్ జరగనుంది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా గురువారం (ఏప్రిల్ 9) ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కేరళలో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మడమ్ నియోజకవర్గం రంగంలో ఉన్నారు. అస్సాంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ మూడు రాష్ట్రాలలోనూ కూడా ఇప్పటికే ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, వృద్ధుల కోసం ర్యాంపులు మరియు వీల్ ఛైర్ల వంటి సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతను ఉత్సాహపరిచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలైన తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌తో కలిపి వచ్చే నెల 4న విడుదల కానున్నాయి. కాగా ఈ మూడు రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






