మాజీ ఎమ్మెల్యే కొడుకుకు షాక్ ఇచ్చిన పోలీసులు.. రాహెల్ విదేశీ ప్రయాణానికి బ్రేక్

posted on: May 2, 2026 10:29AM

హైదరాబాద్ నగరంలో మూడు సంవత్సరాల క్రితం నమోదైన హిట్ అండ్ రన్ కేసు మరోసారి సంచలనంగా మారింది.  మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహా రంలో తాజాగా నాటకీయ పరిణామం చోటు చేసుకుంది.   ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కుమారుడు రాహెల్ ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌లో భాగంగా విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి లేకుండా విదేశా లకు వెళ్లకూడదనే కీలక షరతు కూడా ఉన్నది.

అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాహెల్ మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడం కేసులో కొత్త అనుమానాలకు తావి చ్చింది. విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం  అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.

మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం కేసుపై మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది. విచారణలో ఇంకా ఏయే అంశాలు బయటకు వస్తాయో, కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...