హుక్కా సెంటర్ పై దాడి.. పది మంది అరెస్టు

posted on: Mar 23, 2026 10:46AM

హైదరాబాద్ లో హుక్కా కేంద్రాలపై పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ హుక్కా సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి పది మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు.

వట్టేపల్లి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న హుక్కా కేంద్రంపై అందిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడి చేశారు.  దాడి సమయంలో హుక్కా సేవించి వీరంతా మత్తులో మునిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా  పది హుక్కా పొట్స్‌తో పాటు వివిధ రకాల ఫ్లేవర్లకు చెందిన హుక్కా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా మారే విధంగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...