Latest News
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ కోసం పిటిషన్!
posted on: Mar 16, 2026 12:05PM

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర సంచలనం సృష్టించిన మొయి నాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో పోలీసులు 11 మందిని అదుపులోకి తీకున్నారు. వారిలో అయిదుగురు డ్రగ్స్ సేవించినట్లుగా పరీక్షల్లో తేలింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మరో ఇద్దరికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఇంటికి పంపించారు. మరో ఐదుగురు కి నోటీసు లు ఇచ్చి పంపించారు. అయితే ప్రస్తుతం చంచల గూడా జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీ లోకి తీసుకొని విచారించి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, డ్రగ్స్ సరఫరా మార్గాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం వంటి అంశాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందు కోసం ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.



.webp)


