Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసు ఎందుకంటే?
posted on: May 22, 2026 6:29AM
.webp)
రాజకీయ విశ్లేషకుడిగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు చేసే ఆయన, తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. . అమిత్ షా పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు పెట్టారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌పై కూడా పోలీసులు కేసు నమోదు అయ్యింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ డిబేట్‌లో గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. గతంలో ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారనీ, ఆ సందర్భంగా వారు మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయాలని అమిత్ షాను కోరారనీ చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. అమిత్ షా రాజకీయాల్లో ఇన్‌స్టంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే వ్యత్యాసాలు ఉంటాయనీ, చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్, నాదెండ్ల మనోహర్ లకు తేల్చి చెప్పారనీ అన్నారు. అంతే కాకుండా జగన్ విషయంలో వైఖరి మార్చుకోవాలని కూడా అమిత్ షా పవన్, నాదెండ్లకు సలహా ఇచ్చారని నాగేశ్వర్ ఆ డిబేట్ లో చెప్పారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అమిత్ షా అసలు అనని మాటలను అన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కల్పించి చెబుతున్నారని.. కావాలనే కూటమి నేతల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఆ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు.


.webp)
.webp)


