రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు అంబటి తరలింపు

posted on: Feb 9, 2026 8:24AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారంట్ పై గుంటూరుకు తరలించారు. అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో గత ఏడాది నవంబర్ లో కేసు నమోదైంది.  వైసీపీ పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 12న పట్టాభిపురంలో అంబటి రాంబాబు పోలీసులు ఏరాటు చేసిన బారికేడ్లను తోసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగిన సందర్భంలో కేసు నమోదైంది.

ఈ కేసులో అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశ పెట్టేందుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాంబాబును సోమవారం (ఫిబ్రవరి 19) గుంటూరుకు తరలించారు. అలాగే అంబటి రాంబాబు కస్టడీ, బెయిలు పిటిషన్లపై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టైన అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా అంబటి రాంబాబుపై ఇప్పటి వరకూ 40కి పైగా కేసులు నమోదై ఉన్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...