పోలవరంపై ఆందోళన దేనికోసం?
posted on: Jun 25, 2014 1:10PM
.jpg)
పోలవరం ముంపు ప్రాంతాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచ రెవన్యూ డివిజ్‌లో పోలవరం వ్యతిరేక కమిటీ బంద్ కు పిలుపు ఇచ్చింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలవరం విషయంలో పోరాడుతున్నవారు తమ పోరాటం ముంపు గ్రామాల నిర్వాసితుల సంక్షేమం కోరకా లేక తెలంగాణాకు చెందిన గ్రామాలను ఆంధ్రాకు బదలాయించడాన్ని వ్యతిరేఖంగానా లేక పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగానా అనే విషయం తేల్చుకోవడం మంచిది. ఒకవేళ వారి ఆందోళన అంతా నిర్వాసితుల పునరావాసం కోసమే అయినట్లయితే, వారు తెలంగాణా ప్రభుత్వం ద్వారా కేంద్రంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన ప్యాకేజీ పొందవచ్చును. కానీ వారి పోరాటం, తెలంగాణాకు చెందిన ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి వ్యతిరేఖంగా లేదా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా చేస్తున్నట్లయితే దానివల్ల ఎటువంటి ఫలితమూ ఉండబోదని గ్రహించాల్సి ఉంటుంది. ఎందువలన అంటే ఇంతకు ముందు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఇదే అంశం మీద తెలంగాణా బంద్ నిర్వహించారు. కానీ, కేంద్రం మాత్రం దానిపై స్పందించలేదు. అది గమనిస్తే ఈ విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేసేందుకు సిద్దంగాలేదని స్పష్టమవుతోంది.
దేశంలో అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటువంటి అందోళనల వలన ప్రాజెక్టుల నిర్మాణంలో కొంచెం జాప్యం జరుగుతోందే తప్ప కానీ ఏ ప్రాజెక్టూ కూడా ఆగిపోలేదనే సంగతి పోలవరంపై ఉద్యమిస్తున్న ఆందోళనకారులు గుర్తించవలసి ఉంటుంది. కేంద్రం చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం వలన ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎటువంటి ప్రయోజనమూ కలగదనే విషయం కూడా వారు గ్రహించాలి. అందువలన వారు ఫలితం లేని ఉద్యమం చేయడం కంటే నిర్వాసితులకు న్యాయం చేకూర్చేందుకు గట్టిగా కృషిచేయడం మేలు.



(1).jpg)
.jpg)

.webp)



