మహా కుంభమేళా మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు.. ఎందుకంటే??

posted on: Apr 10, 2026 3:35PM

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో  ఓవర్ నైట్ సెలిబ్రిటీగా మారిన తేనెకళ్ల సుందరి మోనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు  వివాదంలో పడింది.  పెళ్లైన రోజుల వ్యవధిలోనే  ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది.  ఇందుకు కారణం ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను వివాహం చేసుకోవడమే. మోనాలిసా ఇంకా మైనర్ కావడంతో ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది.  నిజమని తేలడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న  కేరళ అరుణ్మనూర్‌లోని  శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు.  అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విశ్వహిందూ పరిషత్   కేరళ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఈ వివాదంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సీఎస్టీ)   విచారణ చేపట్టింది.  మోనాలిసా వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించింది. ఈ దర్యాప్తులో వివాహ సమయానికి మోనాలిసా వయస్సు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని నిర్ధారణ అయ్యింది. అంటే ఆమె  మైనర్ అని కమిషన్ స్పష్టం చేసింది.

చట్టప్రకారం మైనర్ బాలికను వివాహం చేసుకోవడం నేరం కావడంతో..  మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో  చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  కుంభమేళాలో పూసల గొలుసులు అమ్ముకుంటూ తన నవ్వుతో, అందంతో లక్షలాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా జీవితం ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం చర్చనీయాంశంగా మారింది.

మైనర్ వివాహాల పట్ల ప్రభుత్వం, జాతీయ కమిషన్లు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కు చిక్కులు తప్పవని అంటున్నారు. అలాగే మోనాలిసాను కూడా  రక్షణ కేంద్రానికి తరలించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  కుపోతుందని అధికారులు వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...