కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

posted on: May 29, 2026 2:58PM

 

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాప్‌లో జరిగిన భారీ బంగారం దోపిడీ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు సుబోద్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భారీ గోల్డ్ రాబరీ కేసుల్లో సుబోధ్ సింగ్ పేరు బయటకు రావడంతో, చాలా కాలంగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్ లోని పీఎంజే  జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో, అతడిని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా... అతను ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్నట్లుగా గుర్తించారు. 

దీంతో పోలీసులు వెంటనే బీహార్ జైలుకు వెళ్లి అక్కడి నుండి అతని పీటీ వారెంట్‌పై తెలం గాణకు తీసుకొచ్చినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం సుబోధ్ సింగ్ సాధారణ నేరస్థుడు కాదని తెలుస్తోంది. జైలులో ఉన్న ప్పటికీ బయట గ్యాంగ్‌లతో సంబంధాలు కొనసాగిస్తూ, భారీ బంగారం దోపిడీలకు స్కెచ్‌లు వేస్తూ ఉండేవాడని పోలీసులు అనుమానిస్తు న్నారు. 

ముఖ్యంగా సోషల్ మీడియా యాప్ అయిన ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా తన అనుచరులకు సూచనలు పంపిస్తూ గ్యాంగ్ కార్యకలాపాలను నిర్వ హించేవాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకా కుండా, వివిధ జైళ్లలో చోరీ కేసుల్లో రిమాండ్‌కు వచ్చే నిందితులతో స్నేహం చేసి తర్వాత తన గ్యాంగ్‌లో చేర్చుకుని, వారిని రాష్ట్రాల వారీగా ఉపయోగించేవాడని విచారణలో బయటపడింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా అతను ఒక పెద్ద నెట్వర్క్ నే నడుపుతున్నాడని  పోలీ సులు భావిస్తున్నారు.

సుబోధ్ సింగ్‌పై ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో 70కిపైగా కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బంగారం దోపిడీలు, జువెలరీ షాపులపై దాడులు, భారీ చోరీలు ఉన్నాయి. ఇప్పటివ రకు అతడి గ్యాంగ్ దోచు కున్న బంగారం మొత్తం 400 కిలోలకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. PMJ జువెలరీస్ దోపిడీ ఘటన కూడా జైలులో నుంచే రచించిన ప్లాన్ అని పోలీసులు అనుమానిస్తు న్నారు. 

ఈ కేసులో పాల్గొన్న మరికొందరు గ్యాంగ్ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పోలీసులు సుబోధ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించే అవకాశముంది. ఈ విచారణలో దేశవ్యాప్తం గా జరిగిన మరిన్ని గోల్డ్ రాబరీ కేసుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...