Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్దం.. ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం : సీఎం చంద్రబాబు
posted on: Jul 31, 2026 4:42PM

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయాన్ని రేపు ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ విమానాశ్రయం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన పోస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోందని, ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ‘ఎక్స్’ వేదికగా రీ-పోస్ట్ చేశారు. ‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధం.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం మోదీ జీ’ అంటూ సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటు లోకి రావడంతో విదేశీ ప్రయాణాలకు కూడా ఈ ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. విమానాశ్రయం కారణంగా ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
అరకు, బొర్రా గుహలు, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగడానికి విమానాశ్ర యం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు తో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం చంద్రబాబు తన పోస్టులో స్పష్టం చేశారు. మౌలిక వసతుల పరంగా ఈ విమానాశ్రయం కీలక మైన అడుగుగా నిలవ నుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన, విమానాశ్రయం ప్రారంభో త్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సందడి నెలకొంది.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రంగాలు సరికొత్త పుంతలు తొక్కనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రయాణికులకు సరసమైన సమయాల్లో, విస్తృతమైన విమాన సర్వీసులు లభించనుండటం శుభపరిణామం.
భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను ప్రకటించింది.హైదరాబాద్–భోగాపురం మధ్య ప్రతిరోజూ ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అలాగే బెంగళూరు–భోగాపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక విజయవాడ–భోగాపురం మధ్య ప్రతిరోజూ నాలుగు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది
PM Narendra Modi, Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport,
AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau






