Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా ... మోదీ అరుదైన రికార్డు
posted on: Mar 22, 2026 3:53PM
.webp)
ప్రధాని నరేంద్ర మోదీ దేశరాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన మోడీ 2014లో ప్రధాని అయి ఇప్పటివరకు ఆ పదవిలో అప్రతిహంగా కొనసాగుతున్నారు. అంటే గుజరాత్ సీఎం పదవీకాలం సహా ఎలాంటి బ్రేక్ లేకుండా 8,931 రోజులపాటు దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన నేతగా నిలిచారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఆ రికార్డులను నమో బద్దలు కొట్టారు.
గుజరాత్‌కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో ఉన్న మోదీ అప్పట నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నాయకుడు కూడా మోదీనే. కేంద్రంలో రెండు సార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకుని, మూడో సారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు నెలకొల్పారు.
2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించి మోదీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు సార్లు విజయాన్ని అందించిన జవహాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. వరుసగా ఆరు ఎన్నిక్లో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్రమోదీ. 2002. 2007, 2012 ఎన్నికల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి పీఎం అయ్యారు. తర్వాత వరుసగా మూడో సారి ప్రధానిగా నిలిచారు. ఆయన రికార్డులు చూస్తే మున్నుందు కూడా ఆ ఘనత సాధించడం ఎవరికైనా అసాధ్యమే.






