ఆ బాలికను క్షమించేసిన ప్రధాని మోడీ.!

posted on: Aug 3, 2026 8:18AM

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో గత నెలలో  జరిగిన ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలికకు ప్రధాని మోడీ  క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ బాలికపై తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ జీరో ఎఫ్ఐఆర్ లో ఆ బాలికను పాతికేళ్ల యువతిగా పేర్కొన్నారు. 

అయితే ఆ తరువాత ఆ బాలిక ఓ వీడియో విడుదల చేస్తూ.. తన వయస్సు 15 సంవత్సరాలు మాత్రమేననీ, ఇతరుల వల్ల ప్రభావితమై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాననీ పేర్కొంటూ.. క్షమాపణ కోరింది. ఆ క్షమాపణ వీడియోలో అదే తన తొలి తప్పనీ, అలాగే చివరి తప్పుకూడాననీ చెబుతూ.. క్షమించాల్సిందిగా వేడుకుంది.  దీనిపై స్పందించిన ప్రధాని మోడీ..  తప్పుదోవ పట్టిన పిల్లలు తనను దూషించినా క్షమిస్తున్నానని పేర్కొన్నారు. 

ప్రధాని క్షమించడంతో పోలీసులు ఆ జీరో ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి ఆ బాలికపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఆ బాలిక తల్లి హర్షం వ్యక్తం చేస్తూ.. తన బిడ్డకు మోడీ జీవనదానం ప్రసాదించారని పేర్కొన్నారు. తన బిడ్డకు ఇది మరో జన్మ పేర్కొన్న ఆ బాలిక తల్లి..  మైనర్ పిల్లలకు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని విజ్ణప్తి చేశారు. 

PM modi excuse that girl, Jantharmantha, protests, Abuse, Primeminister 

google-ad-img
    Related Sigment News
    • Loading...