Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అపూర్వ భారత్ ప్రచారకర్తగా మోడీ...
posted on: Nov 6, 2016 4:11PM
.jpg)
ప్రధాని నరేంద్ర మోడీ అపూర్వ భారత్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోదీని నియమించాలని కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్ గడువు ముగిసిన తర్వాత ఆ స్థానంలో కేంద్రం మరొకరిని నియమించలేదు. ఇక ప్రచారకర్తగా బాలీవుడ్ ప్రముఖుల్ని నియమించే సంప్రదాయాన్ని పర్యాటక శాఖ పక్కకు పెట్టింది. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్ శర్మ మాట్లాడుతూ..విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని..గతంలో మోదీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. కాగా అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని నియమించనున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.






