మోదీకి ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌...యూఏఈ ప్రత్యేక గౌరవం

posted on: May 15, 2026 6:01PM

 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. మోడీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశ ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చి ప్రత్యేకంగా స్వాగతించింది. యూఏఈ ఎయిర్ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫైటర్ జెట్ ఎఫ్-16 బ్లాక్ 60‘డెజర్ట్ ఫాల్కన్’ మోడీ విమానానికి ఎస్కార్ట్‌గా అబుదాబిలో ల్యాండ్ అయ్యేవరకు వెంటే రావడం గమనార్హం. ఐరోపా దేశాల పర్యటనకు బయల్దేరిన మోడీ మధ్యలో యూఏఈ వెళ్లారు. 

అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపధ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యూఏఈపై తాజాగా ఇరాన్ దాడిని మోడీ ఖండించారు. పశ్చిమసియా యుద్ద ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉందన్నారు. హర్మూజ్ జలసంధి విషయంలో అంతా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ పర్యటనలో మోడీ సమక్షంలో భారత్ యూఏఈతో పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఎల్పీజీ సరఫరా, పెట్రోలియం నిల్వలపై ఎంఓయూ కుదుర్చుకుంది. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ఎంఓయూలపై భారత అధికారులు సంతకాలు చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...