Latest News

పోలీసుల కస్టడీకి పిన్నెల్లి సోదరులు.. మూడు రోజుల పాటు విచారణ

posted on: Jan 20, 2026 1:32PM

మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో  నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మాచర్ల కోర్టు సోమవారం (జనవరి 19) ఆదేశాలు జారీ చేసింది.  గత ఏడాది మేలో పల్నాడు జిల్లా  గుండ్లపాడు గ్రామంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా, వెంకట్రామిరెడ్డి ఏ7గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీం ఆదేశాల మేరకు కోర్టులో  లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.  

ఈ కేసులో పూర్తి నిజాలను వెలికితీయడానికి వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.పోలీసుల వాదనలతో ఏకీభవించిన మాచర్ల కోర్టు న్యాయమూర్తి,  మంగళవారం (జనవరి 20)  నుంచి మూడు రోజుల పాటు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులకు అనుమతినిచ్చారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల రూరల్ పోలీసులు మంగళవారం (జనవరి 20) కస్టడీలోకి తీసుకుని విచారించడమ మొదలు పెట్టారు.  వారిని కస్టడీలోకి తీసుకుని నెల్లూరు జిల్లా జైలులోనే మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...