పైలెట్ రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

posted on: Apr 16, 2026 5:47PM

 

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు విచారణపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగు తోంది. ఈ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలతో పాటు, తనిఖీ లకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా నమోదు కావడం కేసును మరింత తీవ్రతరం చేసింది. 

అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డిని ఈ కేసులో A2 నిందితుడిగా చేర్చారు.
ఇప్పటికే ఈ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి బెయిల్ కోసం ఉప్పర్ పల్లి కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఉప్పర్‌పల్లి కోర్టు ఆయనకు బెయిల్‌ను తిరస్కరించింది. అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రారంభ విచారణ జరిపిన హైకోర్టు, కేసు వివరాలు మరియు దర్యాప్తు పురో గతిపై మరిన్ని సమాచారం అవసరమని భావించి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయని, తదుపరి విచారణలో కేసు కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నారు.ఈ కేసు రాజకీయ వర్గాల్లో కూడా ప్రాధాన్యత సంతరించు కుంది. హైకోర్టులో జరగ నున్న తదుపరి విచారణపై అందరి దృష్టి నిలిచింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...