లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్ బెయిల్ రద్దుకు పిటిషన్

posted on: Feb 12, 2026 8:04PM

 

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో  వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కోర్టులో‌ అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఎక్సైజ్ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 

ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం  జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం నాడు ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...