Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేర్ని నాని క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
posted on: Feb 13, 2026 10:48AM
.webp)
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి తనపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను కోర్టు గురువారం (ఫిబ్రవరి 12) విచారించింది. ఈ సందర్భంగా పేర్ని నానిపై నమోదైన కేసు ఏడేళ్ల లోపు ఈ శిక్షకు సంబంధించినదేనని పేర్కొన్న కోర్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మేరకు పేర్ని నానికి నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది. అనంతరం పేర్ని క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కేసు విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.


.webp)



