మంచుకొండల్లో మారణహోమం.. హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో..  దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.

ఉగ్రవాదానికి మతం లేదంటారు.  మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి?  హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి?  మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా?  పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు.. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గాం ఉగ్రదాడిలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ.. హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం.. పహల్గాం ఉగ్రదాడితో  తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడితో.. కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే.. పహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయ్.

అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్. ఇలా.. ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ.. తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయ్. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడి.. పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే.. కశ్మీర్‌లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవా దులు. ఎందుకంటే.. ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే.. ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు.. టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువులను.. కాఫిర్‌లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు.. ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది.. మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెబుతున్నారు.

కేవలం కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం విభజనని పెంచి.. అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణహోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు. చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం.. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు.. మేము.. నిన్ను చంపం. ఈ భయానక ఘటన గురించి మోడీకి అని.. టెర్రరిస్ట్ ఆమెను ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్‌లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి.. రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే.. ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయ్.

అమర్‌నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు.. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి.. భారత్‌లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతున్నది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని.. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగానూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే.. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.