మరో వివాదంలో పీసీబీ.. పాకిస్థాన్ టి20 వరల్డ్ కప్ జెర్సీపై ఐఎస్ఐ లోగో!

posted on: Feb 3, 2026 12:43PM

టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పాక్ తీరుపై ఇప్పటికే సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతుండగా తాజాగా పాకిస్థాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ)తీరు మరో వివాదానికి తెరలేపింది. టి20 వరల్డ్ కప్ లో ఆడే పాకిస్థాన్ ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన జెర్సీ ఈ వివాదానికి కారణం. ఆ జెర్సీపై పాకిస్థాన్ జాతీయ జంతువు మార్ఖోర్ బొమ్మ ఉండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకీ మార్ఖోర్ అనే అటవీ మేక బొమ్మ పాక్ జెర్సీపై ఉండటం ఎందుకు వివాదంగా మారిందంటే.. అదే బొమ్మను పాకిస్థాన్  ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తన లోగోగా ఉపయోగిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే పాక్ ఆటగాళ్ల కోసం తయారు చేసిన జెర్సీపై ఐఎస్ఎస్ అధికారిక చిహ్నమైన  మార్ఖోర్ బొమ్మ ఉండడాన్ని నెటిజనులు తప్పుపడుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తీరును తప్పుపట్టిన భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ పాక్ ను బహిష్కరించాలని ఐసీసీని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.   

ఇక విషయంలోకి వస్తే.. టి20లో ఆడే తమ జట్టు ప్లేయర్ల కోసం పాకిస్థాన్ తయారు చేసిన ఆకుపచ్చటి జెర్సీ మధ్య భాగంలో నల్లటి రంగుతో  మార్ఖోర్    చిత్రాన్ని ప్రత్యేకంగా ముద్రించింది. ఈ డిజైన్ బయటకు రాగానే సోషల్ మీడియాలో  దీనిపై పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నెటిజెన్లు ఈ విషయాన్ని పాకిస్థాన్ తమ జాతీయ జంతువుకు ఇచ్చిన గౌరవంగా చెబుతుంటే.. అత్యధికులు మాత్రం పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ లోగోలో  ఉపయోగిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతూ.. క్రీడా వేదికపై రాజకీయ లేదా రహస్య సంస్థల చిహ్నాలను ఉపయోగించడం కరెక్ట్ కాదంటున్నారు.  అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఇలాంటి డిజైన్‌లతో జెర్సీ ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అంటున్నారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...