సభకు రాకుంటే జరిమానా!.. టీఆర్ ఎస్ హెచ్చరిక
posted on Aug 27, 2022 11:45AM
బడికి రాకపోతే కొడతానంటా రు టీచర్లు, పనికి సరిగా రాక పోతే తీసేస్తామంటారు అధికా రులు, మాట వినకుంటే తంతానంటాడు తండ్రి. . వీట న్నింటికంటే చిత్రమైంది టీఆర్ఎస్ వారి వాట్సప్ మెసేజ్!
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుం దని, సీఎం కేసీఆర్ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు. ఇప్పుడు ఇది పెద్ద వివాదమైంది.
పంపడం వివాదాస్పదమైంది.
రేపు కొంగర దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్‌కు స్వాగతం పలకాలి. ఉదయం 11 గంటలకల్లా మునిసిపల్ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని బుధవారం డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి.
సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్ కట్టాలని మరో మెసేజ్ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహి ళలు తమ గ్రూప్ లీడర్లకు ఫైన్ కట్టినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ వ్యవహా రంపై విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు, బీజేపీ మహిళా కార్పొరేటర్లు శుక్రవారం బడంగ్‌పేట్ మునిసిపల్ కమిష నర్‌కు వినతి పత్రం అందజేశారు. టీఆర్‌ఎస్ నాయకులు, డ్వాక్రా సంఘాల లీడర్లు ఇలా బెదిరి స్తూ సందేశాలు పంపారని ఆరోపించారు