తమ్ముడికి బాటలో ముళ్ళు పరుస్తున్న మెగా అన్నయ్య

 

 

 

మెగా సోదరుడు నాగబాబు తమకు చిరంజీవి అన్నయ్యే రాజబాట పరిచారని చెపుతుంటే, ఆయన మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంచుకొన్న కొత్త బాటలో ముళ్ళు పరుస్తూ అతనిని కుటుంబంలో, రాజకీయాలలో సమాజంలో కూడా ఒంటరివాడిని చేయాలని ప్రయత్నించడం చాలా విచారకరం. ఆయన పదవుల కోసం ఆరాటపడుతూ ఇప్పటికే తన మెగా ఇమేజ్ పూర్తిగా డేమేజ్ చేసుకొని, ఇప్పుడు తమ్ముడు పవన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెప్పడం, బహుశః ఆయనకు ఎటువంటి బాధ కలిగించకపోవచ్చు గాక, కానీ వారి అభిమానుల మనసులు మాత్రం నొప్పిస్తోంది. అందుకే అనేక మంది ఆయన మాటను కాదని పవన్ కళ్యాణ్ వెంట వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు వారి వద్ద కూడా ఆయన తన గౌరవం పోగొట్టుకోవడమే గాక తమ్ముడితో బాటు వారిని కూడా దూరం చేసుకొన్నట్లయింది.

 

అయితే పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో సఫలమయినా, విఫలమయినా, చిరంజీవి మాత్రం ప్రజల, అభిమానుల దృష్టిలో దోషిగా తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడటం ఖాయం. పవన్ తన ప్రయత్నంలో సఫలమయితే, స్వయంగా అన్నఅయ్యి ఉండి కూడా చిరంజీవి ఆయనకు అడ్డంకులు సృష్టించారని, అయినా వాటినన్నిటినీ అధిగమించి విజయం సాధించారని అందరూ చెప్పుకొంటారు. దురదృష్టవశాత్తు ఒకవేళ పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో విజయం సాధించలేకపోతే, అప్పుడు కూడా ఆయనకు అడ్డంకులు సృష్టించినందుకు ప్రజలు, అభిమానులు చిరంజీవినే నిందించడం ఖాయం. ఈవిషయం గ్రహిస్తే ఆయన అటువంటి ప్రయత్నాలు చేసి ఉండరు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu