సర్జరీ తరువాత తొలిసారిగా పవన్ పిఠాపురం పర్యటన.!

posted on: Jul 18, 2026 2:20PM

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆదివారం (జులై 20)  తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల ఆయన భుజానికి   శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆ సర్జరీ తరువాత   పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు. 

సర్జరీ  అనంతరం  పవన్ కళ్యాణ్ చేపడుతున్న  తొలి అధికారిక కార్యక్రమం ఈ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా  పరిశీలించనున్నారు.   50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న  పలు కొత్త రోడ్ల నిర్మాణ పనులకు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలకు ఆయన   శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు.

ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణపై చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో దాదాపు 3 గంటల పాటు స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. 

deputy cm pawan kalyan, janasena party, pawan kalyan surgery updates, pithapuram development works, ap politics latest

google-ad-img
    Related Sigment News
    • Loading...