వారాహి దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్!

posted on: Jun 25, 2026 10:48AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్  లోకకల్యాణార్థం ఏటా వారాహి దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడు కూడా ఆయన వారాహీ దిక్ష చేపట్టారు. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో  శాస్త్రోక్తంగా ఈ దీక్షా వస్త్రాన్ని ధరించి దీక్ష చేపట్టారు.   కే తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుండి పవన్ కల్యాణ్ వారాహి దీక్షను ఏటా చేపట్టడం  ఒక సంప్రదాయంగా   పాటిస్తూ న్నారు.  ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష  ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు.   

ఈ ఏడాది ఈ దీక్షా స్వీకరణకు ముందు  పవన్ కల్యాణ్.. మంగళగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.  ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిం చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అష్టోత్తర శతనామావళి పూజ జరిపించారు. అంతకుముందు జనసేనాని ఆలయానికి చేరుకోగానే, రాజగోపురం వద్ద ఆలయ  ఈవో,   ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పవన్ కల్యాణ్‌కు పండితులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అంద జేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...