Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ ముక్కు సర్జరీకి...అపోలో బిల్ ఎంతంటే?
posted on: Apr 19, 2026 2:34PM
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? ప్రభుత్వమా? లేక తన కోడలి ఆస్పత్రే కాబట్టి బిల్ లాంటివేవీ ఉండవా? అనే ఆసక్తికరమైన చర్చ ఒకటి నడుస్తోంది. సాధారణంగా రాష్ట్ర మంత్రులు లేదా ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే, ఆ ఖర్చును ప్రభుత్వం భరించే అవకాశం ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్ ప్రభుత్వ ఖర్చు తన కోసం వాడకూడదు అనే సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. గతంలో కూడా ఆయన తన భద్రత లేదా వ్యక్తిగత ఖర్చుల కోసం సొంత నిధులనే వాడుకున్నారు.
డిప్యూటీ సీఎం ముక్కుకు జరిగిన సైనస్ సంబంధిత శస్త్రచికిత్స- డేకేర్ సర్జరీకిగానూ.. అపోలో వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో.. సుమారు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ బిల్లు ఎంత అనే విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం గానీ, జనసేన పార్టీ గానీ అధికారికంగా బయటపెట్టలేదు. ఇక అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్‌కి ఉన్న సంబంధం ఏంటో చూస్తే.. పవన్ అన్నయ్య చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. దానికి తోడు ఆమె కూడా ఇందులో భాగస్వామి. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్ వారి సొంత కుటుంబానికి చెందినదిగా భావించవచ్చు.
హాస్పిటల్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం బిల్లు అనేది తప్పనిసరిగా జనరేట్ అవుతుంది. అయితే.. సొంత కుటుంబ సభ్యులకు లేదా అత్యంత సన్నిహితులకు ఆసుపత్రులు కొన్నిసార్లు డిస్కౌంట్ ఇవ్వడం లేదా కేవలం మెడిసిన్ ఖర్చులనే తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇక పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ప్రకారం, ఆయన ఉచితంగా చికిత్స పొందేందుకు ఇష్టపడరని, తన బిల్లును తానే చెల్లించుకునే అవకాశమే ఎక్కువగా ఉందని అంటారు.. ఫైనల్ గా ఈ బిల్లు ఎవరు కట్టారు అనే దానిపై అధికారిక ప్రకటన లేకపోయినా, పవన్ కల్యాణ్ ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత చికిత్సకు వాడే రకం కాదని ఆయన గత ప్రవర్తనను బట్టి చెప్పవచ్చు. అది ఆయన కోడలి హాస్పిటల్ కాబట్టి, కుటుంబ సభ్యుల మధ్య ఉండే వెసులుబాటు ఉండవచ్చు, కానీ రికార్డుల ప్రకారం బిల్లు ప్రక్రియ మాత్రం జరిగి ఉంటుందని అంచనా.


.webp)



