Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇది చెప్పడానికా సభ పెట్టింది..?
posted on: Nov 10, 2016 8:22PM
.jpg)
కాకినాడ సభ తర్వాత ఇక ఎలాంటి బహిరంగ సభలు పెట్టను అన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి మళ్లీ అనంతపురం సభకు పిలుపు నిచ్చారు. సినిమాలు వేగంగా కంప్లీట్ చేసి 2019 ఎన్నికల మహా సంగ్రామంలో దూకేందుకు పవన్ సన్నాహాలు చేసుకోబోతున్నారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం సభ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఎప్పటిలాగే పవన్ ఈసారి ఏం మాట్లాడతారా.? ఏం నిర్ణయం తీసుకుంటారా అని తండోపతండాలుగా తరలివచ్చిన అభిమానులకు పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటిచేస్తున్నట్లు..అది కూడా అనంతపురం నుంచే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
2019లోపు ఎప్పుడైనా తాను క్రీయాశీలక రాజకీయాల్లోకి రానున్న ప్రకటన పవన్ చేస్తారనుకున్న వారికి ఇది లడ్డూ లాంటి వార్తే. కానీ ఈ వార్త చెప్పడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని కాసేపు కదిపి.. దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొన్ని పంచ్‌లు వేసి జనానికి బోర్ కోడుతుంది అనుకున్న టైంలో ఈ వార్త చెప్పారు. ఈ విషయం చెప్పడానికి దానికి సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అని పేరు పెట్టడం దేనికి..హైదరాబాద్ జనసేన కార్యాలయం నుంచో లేదా తన నివాసం నుంచో చిన్న ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది. దీని వల్ల ఎన్నో పనులు మానుకుని పవన్ సభకు వచ్చిన వారి టైం వేస్ట్.. సభకు భద్రత కల్పించిన పోలీసుల శ్రమ వృథా... మీటింగ్‌కు స్పాన్సర్ చేసిన వారి డబ్బు దండగ... ఇలా పెదవి విరుస్తున్నారు పవన్ ప్రత్యర్థులు!






