జుట్టు పీక్కుంటున్న పవన్ ఫ్యాన్స్...

posted on: Mar 17, 2018 4:59PM

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును చూసి ఆయన అభిమానులు జుట్టు పీక్కుంటున్నారట. అసలు తాము ఎవరికి శత్రువులమో..ఎవరికి మిత్రులమో అని అయోమయంలో పడిపోయారట. ఇప్పటి వరకూ టీడీపీ-జనసేన మిత్రులుగా ఉన్నారనుకున్న వారందరికీ.. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీపై విమర్శలు గుప్పించి అందరికీ షాకిచ్చాడు. లోకేశ్ నుండి టీడీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇక ఆరోజు నుండి టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీకి తాను వ్యతిరేకమని పవన్ చెప్పనకే చెప్పారు అని అంటున్నారు. రాజకీయవిశ్లేషకులు. దీంతో పవన్ అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారట. కారణం.. ఇన్ని రోజులు తాము టీడీపీ మిత్రులమని అనుకోవడమే.

 

ఇక ఇన్ని రోజులు పవన్ వైసీపీకి వ్యతిరేకం అని అనుకున్నారు. ఎప్పుడూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడంతో అందరూ అదే కరెక్ట్ అనుకున్నారు. వైసీపీ అయితే పవన్ వెనుక టీడీపీ ఉందని.. పవన్ చంద్రబాబు ఆడినట్టు ఆడుతున్నారని కామెంట్లు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్... పవన్ తనతో మాట్లాడి.. వైసీపీకి మద్దతు ఇవ్వబోతున్నట్లు చెప్పి బాంబు పేల్చారు. పోనీ దానిపై పవన్ స్పందించి.. సమాధానం ఇచ్చారా...? అంటే అదీలేదు.. ఆవార్తలను ఖండించలేదు.. మరోవైపు భాజపా తో పవన్ కుమ్మక్కయ్యాడని చంద్రబాబు అంటాడు. దానిని కూడా పవన్ ఖండించలేదు. అలాగని భాజపా వారి వైఫల్యాలను తిట్టడమూ లేదు. సరే భాజపాతో కలిసి నడుస్తారేమో అని అనుకుంటుండగా.. ఆయన వామపక్షాలతో కలిసి ప్రజాపోరాటాలుచేస్తాం అని ప్రకటించారు. దీంతో తాము ఎవరికి మిత్రులో ఎవరికి శత్రువులో తెలియక పవన్ కల్యాణ్ అభిమానులు సతమతం అయిపోతున్నారట. మరి అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూజన్లో పోవాలంటే.. ముందు పవన్ లో ఉన్న కన్ఫ్యూజన్ పోవాలి...అప్పటివరకూ అభిమానులకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు...

google-ad-img
    Related Sigment News
    • Loading...