తెలుగుదనానికి ప్రతీక ఉగాది.. పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

posted on: Mar 19, 2026 7:58AM

అచ్చమైన తెలుగుదనానికి ఉగాది ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో   తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమనీ..  తెలుగు సంవత్సరాది   ప్రతి ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు నింపాలని   ఆకాంక్షించారు.  

ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మన వారసత్వానికి,  మూలాలకు నిదర్శనమన్నారు.    కష్టసుఖాల సమ్మేళనమే జీవితం అని    షడ్రుచుల సమ్మేళనమైన ఉగాదిపచ్చడి చాటుతుందని పవన్ పేర్కొన్నారు,  

వసంతంలో ప్రకృతి ఎలా అయితే ఆకుపచ్చటి శోభను తీసుకువస్తుందో.. అలాగే ఈ ఉగాది కూడా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలను, సిరిసంపదలను తీసుకురావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.   పర్యావరణహిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రకృతిని గౌరవించే మన సంప్రదాయాలను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...