పవన్ మౌనం వెనుక అర్దం ఏంటో....?

posted on: Feb 3, 2018 10:37AM

 

ప్రశ్నిస్తాను... ప్రశ్నిస్తాను అని అదేంటో కరెక్ట్ గా ప్రశ్నించే టైం వచ్చేసరికి సలైంట్ అయిపోతాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో ఎక్కడాలేని డౌట్లు వస్తుంటాయి. 2018-19 సంవత్సరానికి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పటిలాగే కేంద్ర రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించారు. తమకు కావాల్సిన చోట్ల... కావాల్సిన రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా నిధులు కేటాయించుకున్నారు. కేంద్రం చేసిన ఆపనికి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా రోజూ విమర్సలు గప్పిస్తూనే ఉన్నాయి. ఆఖరికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీసైతం కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతుంది.

 

ఇక్కడి వరకూ ఓకే కానీ ఈ విషయంలో పవన్ మాత్రం..ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన 'పవన్‌' ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని...ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అయితే అప్పటికి ఇంకా క్రియాశీల రాజకీయాల్లోకి రానేలేదు పవన్. కానీ ఇప్పుడ పరిస్థితి మారింది. తాను సినిమాలకు గుడ్ బై చెప్పి... పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన పవన్.. ఇంతటి కీలకమైన విషయంపై ఎందుకు నోరెత్తడం లేదన్న ప్రశ్న మొదలవుతుంది. ఆంధ్రాకు, తెలంగాణాకు అన్యాయం జరిగిందని లోకమంతా కోడై కూస్తున్నా...ఎందుకు 'పవన్‌' మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.

 

ఆయన సీరియస్‌ రాజకీయాలకు పనికిరారని, పనిలేనప్పుడు ఆయన రాజకీయాలను వేదికగా చేసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు..'పవన్‌' బడ్జెట్‌ వచ్చిన రోజే స్పందిస్తే..ఆయనకు మైలేజ్‌ వచ్చేది కదా..అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై అధికారికంగా స్పందించలేదు.. అప్పుడు 'పవన్‌' దాన్ని వినియోగించుకుని ఉంటే...ఆయనకు ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగేది. కానీ..ఆయన దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో స్థిరంగా రాణించాలనే భావనతో ఉన్నవారు ఇటువంటి అవకాశాలను వదులుకోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటో... బడ్జెట్ పై ఆయన ఎప్పుడు స్పందిస్తాడో...చూద్దాం...

google-ad-img
    Related Sigment News
    • Loading...