ఒక్క టూర్.. పవన్ ను మార్చేసిందిగా...!
posted on: Nov 21, 2017 11:44AM
.jpg)
ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని సరదాగా చెప్పుకుంటుంటా..అప్పుడప్పుడు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక్క టూర్ పవన్ ను మార్చేసిందా అనిపిస్తోంది. గత మూడు రోజులుగా పవన్ లండన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరుపై.. ఆయనకు 'ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం' ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించింది. దీంతో పవన్ కు ఉన్న మైలేజ్ ఇంకా పెరిగిపోయింది. మరోవైపు పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు అవార్డు రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇదే జోష్ లో ఉన్న పవన్ కూడా ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి.. వారితో మమేకం అయి.. వారి సమస్యలను తెలుసుకొని కృషి చేయాలని భావిస్తున్నారట.
అయితే పవన్ ఇంతకుముందు కూడా ఇవే ఆలోచనలు చేసేవాడు. ఇక 2019లో పార్టీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే వర్కవుట్లు చేస్తున్నారు. కానీ.. పవన్ సినిమాలు చేస్తూ.. విదేశాల్లో ఉండటం వల్ల కొన్ని పనులు మాత్రం జరగడంలేదు. కానీ విదేశీ పర్యటన నుంచీ తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పారట.. లండన్ టూర్ నుండి వచ్చిన పపన్ పార్టీ నేతలతో సమావేశమై.. త్వరలోనే ప్లీనరీని నిర్వహించి, పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారట. అందుకే..ప్లీనరీకి సంభందించిన ఏర్పాట్లు..తదితర విషయాలు వేగవంతం చేసేలా పార్టీ శ్రేణులకి చెప్పారట. అంతేకాదు... పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని..రెండు రాష్ట్రాలలో చాలా వేగంగా సభ్యత్వ నమోదు జరిగేలా చూడాలని పార్టీ నాయకులని ఆదేశించారని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికలకు కూడా ఎంత సమయం కూడా లేదు కాబట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే విషయంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి లండన్ వాళ్లు ఇచ్చిన అవార్డు ఎఫెక్ట్ వల్ల... లండన్ టూర్ వల్ల పవన్ లో మార్పు బాగానే వచ్చింది.



.jpg)
.jpg)

.webp)



