జనసేన సర్వే గ్రాఫ్ లో ఇంత తేడానా..!

 

సాధారణంగా ఎన్నికల్లప్పుడు పార్టీలు సర్వేలు జరపడం కామన్ థింగే. కానీ ఇటీవల ఎప్పుడు పడితే సర్వేలు చేయడం.. ఒక్క ఎన్నికలప్పుడే కాదు.. అసలు ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది.. పార్టీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి కూడా సర్వేలు చేస్తున్నారు. అయితే అలా జరిపిన సర్వేలో టీడీపీ, వైసీపీ పార్టీల సంగతేమో కానీ జనసేన పార్టీకి మాత్రం పెద్ద షాకే తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటని అనుకుంటున్నారా..?

 

జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇప్పటినుండే కసరత్తులు మొదలు పెట్టాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే... ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఏ పార్టీ ప‌రిస్థితి ఏంటిఅని..  ప్ర‌జ‌లు ఏ లీడ‌ర్‌కి మ‌ద్ద‌తిస్తున్నారు…? ఏ పార్టీకి ఎన్నిక‌ల‌లో ఓట్ల శాతం ద‌క్కనుంది..? అనే అంశాల‌ని జిల్లాల వారీగా చిన్మ‌యి క్రొవ్విడి అనే ప్ర‌ముఖ సెఫాల‌జిస్ట్ స‌ర్వేలు నిర్వ‌హించింద‌ట‌. అయితే ఈ సర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే... ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..  టీడీపీకి 42-43 శాతం ఓట్ బ్యాంక్ వ‌స్తుంద‌ట‌. ఇక‌, వైఎస్సార్‌సీకి 33-34 శాతం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతార‌ట‌.ఇక జనసేన పార్టీ సంగతి ఏంటంటారా.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది మరి. ఇప్పటి వరకూ 1 లేదా 2 శాతానికే పరిమితమైన ఓట్ల శాతం ఇప్పుడు ఏకంగా అది 12 నుంచి 14 శాతానికి పెరిగింది. దీంతో ఇప్పుడే ఇలా ఉండే.. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి.. ఎన్నికల ప్రచారాల్లో కనుక పాల్గొంటే ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏమో ప్రతిపక్ష నేత కూడా కావొచ్చేమో..మరి వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో... ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో... తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.