అందరిని విమర్శించిన పవన్ చిరు ని ఎందుకు వదిలేసాడు?
posted on: Apr 15, 2017 4:27PM
.jpg)
వాళ్లు, వీళ్ళు, మిత్రులు, శత్రువులు... అని ఎవర్ని చూడకుండా లెఫ్ట్, రైట్ ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు ఎంపీల వ్యవహారం తనకు బాధ కలిగిందని, ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు సైలెంట్ గా ఉండడం లో పరమార్ధం ఏంటని ప్రశ్నించాడు. టీడీపీ, బీజేపీ ల కన్నా వైస్సార్సీపీ, తెలంగాణ ఎంపీలు చాలా నయం అని వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతా ఒకే కానీ, చిరంజీవి విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకపోవడానికి అర్ధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యసభలో అతి తక్కువ హాజరు ఉన్న వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. స్పెషల్ స్టేటస్ గురించి ఒకప్పుడు గొంతు ఎత్తి మాట్లాడిన చిరు, ఇప్పుడు అసలు మాట్లాడక పోవడం ఎవరికీ అర్ధం కానీ విషయంగా మిగిలి పోయింది. కనీసం ఆ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో తనవంతు బాధ్యతగా, సభకి వచ్చి తన అభిప్రాయం వ్యక్తపరిస్తే అది, స్పెషల్ స్టేటస్ కి ఉన్న డిమాండ్ ని బలపరిచే విధంగా ఉండేది. కానీ, స్వయానా, తెలుగు వారే అసలు సమయంలో సభకి అటెండ్ అవ్వకపోవడం ద్వారా, స్పెషల్ స్టేటస్ డిమాండ్ ని బలహీనపరిచిన అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. మరి, పవన్ తన అన్నని ఈ విషయంలో విమర్శించడం మరచిపోయారా? అన్నకు ఒక ధర్మం, వేరే వాళ్ళకి ఇంకో ధర్మమా అని విమర్శలు వస్తున్నాయి. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో.







.webp)


