పవన్ కళ్యాణ్ పై ఇంత డౌట్ వచ్చిందేంటబ్బా..?

posted on: Jan 27, 2016 3:45PM

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు కొంత మందికి విచిత్రమైన డౌట్లు వస్తున్నాయి. అవి ఏంటంటారా.. అసలు పవన్ కళ్యాణ్ పొలిటీషియనేనా అని.. ఇప్పుడు ఇంత సడెన్ గా పవన్ కళ్యాణ్ పై ఆ డౌట్ రావడానికి కారణం ఏంటని తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు గాను పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే టీడీపీ-బీజేపీ పార్టీలన్నీ కలిసి పవన్ కళ్యాణ్ ను ప్రచారంలోకి దింపాలని చూశాయి.

గతంలో సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీ-బీజేపీ తరుపున ప్రచారం చేసి వాటి గెలుపులో ముఖ్య భూమిక పోషించారు పవన్ కళ్యాణ్. అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా పవన్ తో ప్రచారం చేస్తే తమకు కొంచెం ప్లస్ అవుతుందని భావించారు. హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కారణంగా తమ పార్టీ తరుపున పవన్ ను ప్రచారంలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి రారని దాదాపు తేలిపోయింది. నిన్న మొన్నటి వరకూ ఆయన ప్రచారానికి వస్తారో.. రారో అన్న అనుమానాలు ఏర్పడ్డ ఇప్పుడు రారని కన్ఫర్మయిపోయింది. ఎందుకంటే తాజాగా కేంద్ర మంత్రి - టీడీపీ నేత సుజనా చౌదరి పవన్ కు ఫోన్ చేసి గ్రేటర్ ప్రచారానికి రావాల్సిందిగా కోరగా ఆయన నో చెప్పినట్లు సమాచారం. అంతేకాదు తాను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్నానని... ఇప్పుడు రావడం ఎంతమాత్రం కుదరదని ఆయన చెప్పేశారని అంటున్నారు.

అంతేకాదు తాజాగా పవన్ కళ్యాణ్ తమ అభ్యర్ధి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తమ అభ్యర్ధిని జూబ్లిహిల్స్ డివిజన్ తరుపున పోటీ చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని.. దీనికి సంబంధించి టీడీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారని.. దీనికి టీడీపీ నేతలు ఈ డివిడన్ బీజేపీకి ఇచ్చామని.. మేం ఏం చేయలేమని చెప్పారని.. దానికి పవన్ బీజేపీ నేతలతో కూడా మాట్లాడాటనికి రెడీ అయ్యారని అనుకున్నారు. కానీ ఈ హడావుడి అంతా రెండు రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు దీని ఊసే ఎక్కడా వినిపించడంలేదు.

దీంతో ఇప్పుడు అసలు పవన్ పొలిటీషియనేనా.. బీజేపీ.. టీడీపీ తరుపున ప్రచారానికి వస్తారంటే రావడంలేదు.. కనీసం తన పార్టీ అభ్యర్ధినైనా రంగంలోకి దింపుతారంటే అది కూడా లేదు.. అని అనుకుంటున్నారు. మరి  ఈ విషయాల్ని పపన్ పట్టించుకుంటారా.. లేక లైట్ తీసుకుంటారా చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...