పవన్ అడిగిన సీటు ఇస్తారా..? ప్రచారానికి వస్తారా..?

posted on: Jan 18, 2016 4:50PM

గ్రేటర్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ తన ప్రచారాన్ని షురూ చేశాయి. అయితే ఇప్పుడు అందరి సందేహం మాత్రం ఒక్కటే. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అని. ఎందుకంటే ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేని నేపథ్యంలో టీడీపీ బీజేపీ కూటమికి ఓటు వేయాలంటూ ఆయన బహిరంగంగా ప్రకటిస్తారో లేదో కూడా ఇరు పార్టీల నాయకులకు అర్థంకావడం లేదట.

ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 150 డివిజన్లు ఉండగా బీజేపీ-టీడీపీ పార్టీల సీట్ల సర్ధుబాటు జరిగింది. టీడీపీ 90 స్థానాలకు గాను.. బీజేపీ 60 స్థానాలకు గాను పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ  సన్నిహితులకు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో బాగంగానే జూబ్లీహిల్స్ డివిజన్ సీటును బీజేపీ టీడీపీ కూటమి తరపున తన సన్నిహితుడు సుభాష్ రెడ్డికి ఇప్పించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నారంట. అంతేకాదు ఈ విషయంపై గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ను ఫోన్ చేసి మరీ అడిగారట. అయితే ఆ సీటు బీజేపీకి ఇచ్చామని ఆయన చెప్పడంతో.. ఆయన బీజేపీ రాష్ట్ర నేతలతో మాట్లాడేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

మరి ఇప్పుడు పవన్ కోరిక మేరకు బీజేపీ అడిగిన ఒక్క టికెట్ ను ఇస్తుందా అని డౌట్. మరోవైపు పవన్ కోరితే  బీజేపీ కూడా అడ్డు చెప్పదని..ఆ సీటును ఆయన సన్నిహితుడికి ఇస్తుందని.. ఎలాగూ అతని గెలుపు బాధ్యతను పవన్ తీసుకుంటాడనే ధీమా ఆ పార్టీకి కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి బీజేపీ పవన్ అడిగిన టికెట్ ఇస్తుందా.. ఒకవేళ పవన్ అడిగిన టికెట్ ఇవ్వకపోతే పవన్ బీజేపీ-టీడీపీ తరపు ప్రచారానికి వస్తారా.. లేదా.. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ప్రచారానికి రానని చెబుతారా.. ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే వెయిట్ చేయాల్సిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...