Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనసేన గూటికి రాజాసింగ్? .. పవన్ వ్యూహమేంటి?
posted on: Aug 11, 2026 1:24PM

తెలంగాణ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారబోతున్నాయా? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరి పోరేనని బీజేపీ స్పష్టం చేయడంతో రాష్ట్రంలో జనసేన బలోపేతానికి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? జీహెచ్ఎంసీ, తెలంగాణ స్థానిక ఎన్నికలే కాకుండా.. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా సత్తా చాటేందుకు జనసేనానిని ప్రణాళికలు రచిస్తున్నారా? తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కల్యాణ్.. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్న మాజీ బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు గాలం వేస్తున్నారా? అంటే రాజకీయవర్గాలలో ఔనన్న సమాధానమే వస్తోంది.
గతంలో బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు. బీజేపీకి దూరమైన రాజాసింగ్.. ప్రస్తుతం తన రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించేందుకు ఒక బలమైన వేదిక కోసం అన్వేషణలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజాసింగ్ కు జనసేన తలుపులు తెరిస్తే.. రాష్ట్రంలో జనసేన బలోపేతం అవుతుందన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.
రాజాసింగ్ జనసేన గూటికి చేరే అవకావాలున్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చేలా రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను, ఆయన నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి, ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమంటూ రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంతో పరిశీలకులు రాజాసింగ్ జనసేన గూటికి చేరడం ఖాయమని అంటున్నారు.
జాతీయ స్థాయిలో బిజెపితో పవన్ కళ్యాణ్ సత్సంబంధాలను కొనసాగిస్తుండటం, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తుండటం కూడా రాజాసింగ్ జనసేన గూటికి చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొనేలా చేస్తున్నాయి.
Pawan Kalyan, Raja Singh, Telangana Janasena, Goshamahal MLA, GHMC Elections, Telangana Politics, TeluguOne






