పవన్ ను పరామర్శించిన గవర్నర్.!

posted on: Jul 16, 2026 3:17PM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో  ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను గవర్నర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి  పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని   గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు.  అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయంలోని పలు విశిష్టమైన పుస్తకాల గురించి గవర్నర్  ఉపముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు.  ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు గవర్నర్ ఒక పుస్తకంపై తన  సంతకం  చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...