తన తల్లి పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్
posted on: Jan 29, 2026 5:15PM
.webp)
తన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... విశాఖలోని ఇందిరా గాంధీ జూపార్కులో ఉన్న రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు ఏడాది పాటు అయ్యే ఆహార ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని తెలిపారు. ఈ స్ఫూర్తితో జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని అటవీ శాఖ మంత్రి పిలుపునిచ్చారు. జంతు ప్రదర్శనశాలో ఏనుగులు, జిరాఫీలకు పవన్ స్వయంగా ఆహారం అందించారు.
ఎలుగుబంట్లు ఎన్‍క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, నీటి ఏనుగులు, పులులు, సింహాల ఎన్‍క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ, మార్గమధ్యలో ఉన్న మొక్కల గురించి అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు.






