కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
posted on Nov 9, 2025 3:36PM
.webp)
చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులు తీసుకోచ్చినట్టు ఆయన తెలిపారు. ఇళ్లు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో వివరించారు. గజరాజులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా పవన్.. వాటి విన్యాసాలను తిలకించి ఆహారం తినిపించారు.
అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు., కుంకీ ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు.