పాస్‌పోర్ట్ సిటిజన్ షిప్ కు రుజువు కాదు: కేంద్రం ప్రకటన!

posted on: Jun 25, 2026 9:57AM

ఇండియన్ పాస్ పోర్టు ఉన్నంత మాత్రాన  ఇండియన్ సిటిజన్ అయిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా పేర్కొంది.  ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమే కానీ.. అదే సిటిజన్ షిప్ ను రుజువు కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిఫై చేసింది.  పాస్‌పోర్ట్ సేవా దివస్  సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ మేరకు అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. 

 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ నుండి ఎవరైనా తొలగించబడితే, వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను  ఆధారంగా చూపించవచ్చా అన్న ప్రశ్నకు ఆయనీ బదులిచ్చారు.  చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో   జాతీయతను సూచిస్తుందే తప్ప, అది భారతదేశ పౌరసత్వ పత్రం కాదని కుండబద్దలు కొట్టారు.  

కేంద్రం ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం  నాయకుడు  ఆదిత్య థాకరే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది  విడ్డూరంగా ఉందని  మండిపడ్డారు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ పత్రం కానప్పుడు.. దానిని ఒక సాధారణ పౌరుడికి జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు అన్ని రకాల వెరిఫికేషన్లు చేస్తారని  నిలదీశారు. నాన్ ఇండియన్స్ కూడా  పాస్‌పోర్ట్‌లను ట్రావెల్ డాక్యుమెంట్లుగా కేంద్రం ఇస్తుందా అని నిలదీశారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఇండియన్ పాస్‌పోర్ట్  చట్టబద్ధత పై తీవ్ర అనుమానాలు రేకెత్తించేలా ఉందని సామాజిక మాధ్యమ వేదికలో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

గతంలో సుప్రీం కోర్టుతోపాటు పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం.. భారతదేశంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్.  గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ కూడా  పౌరసత్వానికి తిరుగులేని చట్టపరమైన ఆధారాలు కావు. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి గుర్తింపు,  నివాస ధ్రువీకరణ కు మాత్రమే   పనికొస్తాయి. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్‌షిప్ సర్టిఫికెట్' జారీ చేస్తుంది. కానీ   దేశంలోనే పుట్టి పెరిగిన  ఇండియన్స్ కుఅలాంటి  పౌరసత్వ పత్రం ఏదీ ఉండదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చేసిన ఈ తాజా ప్రకటన   ప్రజల్లో తీవ్ర గందరగొళానికీ, చర్చకూ దారి తీసింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...