దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్
posted on: Mar 11, 2026 11:16AM
.webp)
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన ఫిర్యా దులను పరిశీలించిన స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఇద్దరు ఎమ్మె ల్యేలు పార్టీ మార్పిడి చేశా రని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం స్పీకర్ వాటిని డిస్మిస్ చేశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి పై ఉన్న పార్టీ ఫిరాయింపు ఆరోపణల నుంచి వారికి క్లీన్ చిట్ లభించింది. ఫిర్యాదులపై అందిన పత్రాలు, ఆధారాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్ల డించింది.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత విధించాలనే అభ్యర్థనలను స్పీకర్ తిరస్కరించారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ మార్పిడి ఆరోపణలు రావడంతో వారి సభ్యత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం నుంచి కూడా ఈ వ్యవహారంపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ ఈ ఫిర్యాదులను కొట్టివే యడంతో వారి సభ్యత్వాలు కొనసాగనున్నాయి. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.





