విశాఖలో పెట్టుబడుల సదస్సు..తొలి రోజు రికార్డు స్థాయిలో ఎంవోయూలు
posted on Nov 15, 2025 8:13AM
.webp)
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు శుక్రవారం (నవంబర్ 14) రికార్డు స్థాయిలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ భాగస్వామ్య సదస్సుకు అద్భత స్పందన లభించింది. రెండు రోజుల సదస్సులో మొత్తం 400 ఎంఓయూల ద్వారా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా. ఇందులో భాగంగా తొలి రోజు సదస్సులో రూ. 8. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఎంఓయూల ద్వారా 12.05 లక్షల ఉాద్యోగాలు వస్తాయన్నది అంచనా. అంతే కాకుండా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఇక రెండో రోజు అంటే ఆదివారం 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్న ఈ ఎంవోయూల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు జరుగుతాయని తెలిపాయి.