Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ!
posted on: Mar 10, 2016 9:55AM
.jpg)
పార్లమెంటులో ఉభయసభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, దానికి ధన్యవాదాలు చెబుతూ పార్లమెంటు సభ్యులు ధన్యవాదాలు చెప్పడం ఆనవాయితీ. ఒకవేళ రాష్ట్రపతి ప్రసంగంలో తమకు నచ్చని అంశం ఏదన్నా ఉంటే, ప్రతిపక్షాలు దాని మీద చర్చను లేవనెత్తుతాయి. అరుదైన సందర్భాలలో మాత్రం ప్రసంగానికి ఒక సవరణ అవసరం అంటూ ప్రతిపాదిస్తాయి. ఇది నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బందిలోకి నెట్టే అంశం. ఎందుకంటే ప్రసంగాన్ని చదివేది రాష్ట్రపతే అయినా, ఆ ప్రసంగపాఠాన్ని ప్రభుత్వానికి అనుకూలంగానే రూపొందిస్తారు. నిన్న పార్లమెంటులో ఇలాంటి సంఘటనే జరిగింది. త్వరలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో జరగబోయే స్థానిక ఎన్నికలలో పాల్గొనేందుకు కనీసం మెట్రిక్యులేషన్ చదివి ఉండాలన్న నియమాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పరిచాయి.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలామంది ఎన్నికలలో పాల్గొనలేరనీ, ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే అక్కడి ప్రభుత్వాలు ఈ నియమాన్ని ఏర్పరిచాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికలలో పాల్గొనేందుకు అందరికీ సమాన హక్కులు ఉండాలనీ, ఈ విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొని ఉంటే గౌరవంగా ఉండేది అంటూ రాష్ట్రపతి ప్రసంగానికి ఒక సవరణను ప్రతిపాదించింది కాంగ్రెస్. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను వెనక్కి తీసుకోవల్సిందిగా మోదీ సహా ఎందరు నాయకులు వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. సవరణ కోసం కాంగ్రెస్ తుదివరకూ పట్టుపట్టడంతో సభ దానిని ఆమోదించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ చేయడం అనేది ఇది కేవలం ఐదోసారి. మరి పాలకపక్షం దీన్ని అవమానంగా భావించకుండా ఉంటుందా!


.jpg)
.jpg)


