అస్తమించని అగ్నికణం ‘పరిటాల రవి’
posted on: Jan 24, 2026 5:47PM

పరిటాల రవి .. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు... ఏ అండా లేని సామాన్యుడికి ఒక భరోసా. జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించిన చరితార్థుడు. పీడిత వర్గాల గుండెచప్పుడు దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతి నేడు. 2005 జనవరి 24 యావత్తు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, అట్టుడికి పోయేలా చేసిన దుర్దినం. రాజకీయ ప్రత్యర్ధులు పన్నిన కుట్రతో జనవరి 24న టీడీపీ కార్యాలయంలో కిరాయి మూకల కాల్పుల్లో హతమయ్యారు.
పరిటాల రవీంద్ర 1958 ఆగస్టు 30 న జన్మించారు. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ శివారు వెంకటాపురం. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి నక్సలైటు ఉద్యమానికి పుట్టినిల్లు పరిటాల రవీంద్ర యిల్లు. తండ్రి పరిటాల శ్రీరాములు నక్సలైటు. ఉహ తెలిసినప్పటి కమ్యూనిస్టు పోరాటాల్లో రాటుడేలిన యోధుడు.
1975లో భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు కుట్రపన్ని పరిటాల శ్రీరాములు, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. కన్నబిడ్డల కోసం గుండెను బండరాయిలా చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డారు. తమ్ముడు హరితో పటు ఆహోరాత్రాలు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు.
తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. ఆ క్రమంలో భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు పరిటాల రవీ మీద దృష్టిని సారించారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరాములు హత్య కుట్ర దారుడు మద్దెలచెరువు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మోల్యే గంగుల నారాయణ రెడ్డిని 1983లో పీపుల్స్‌వార్ కాల్చి చంపింది. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు.
అప్పట్లో అజ్ఞాత జీవితం గడుపుతూనే తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన పరిటాల రవి జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసరిగా కొంగ్రెసేతరఏతర ప్రభుత్వాని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలో1984లో పరిటాల రవీంద్ర అజ్ఞాతం వీడి తన స్వగ్రామం చేరుకున్నారు. 1984 అక్టోబర్ 27న దర్మవరుపు కొండన్నపెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి పెళ్లి జరిగింది.
అప్పట్లో పరిటాల శ్రీరాములు హత్యకేసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు. ఆ హత్యకేసులోను పరిటాల రవిని నిందితుడ్ని చేయడంతో మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లి కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు అప్పుడే నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి.
తర్వాత కేసుల నుంచి బయిటపడి తిరిగి వెంకటాపురం చేరి, తన తండ్రి, తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్లడానికి ఉపక్రమించారు. ఫ్యాక్షనిజాన్ని నిర్ములించటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని,అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఆనతికలంలోనే పరిటాల రవికి దనదైన ఒక ప్రత్యక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. రాష్ట్రంలో 1985లో జరిగిన మండల వ్యవస్థ తొలి ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యాధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు.
అదే సమయంలో పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బుటాకపు ఎన్ కౌంటర్ ల వెనక కీలకమైన వ్యక్తి సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కొంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు. భారీ పొలిసు బందోబస్తుతో ఎన్నకల ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్న పరిటాల రవీంద్ర సాహసం ... అప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్ని యిచ్చింది. 1991 నుంచి స్వైర విహారం చేస్తున్న ఆరాచక శక్తుల్ని ఎదుర్కొంటూ పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యారు.
తననీ తన అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రీకరించి హతమార్చడానికి కుట్ర జరుగుతోందని గ్రహించిన పరిటాల రవి 1992లో పోలీసులకు లొంగిపోయారు. 1993లో పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో యావత్తు రాయలసీమ ఆయనకు బ్రహ్మరథం పట్టింది. మద్దెలచెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసి పెనుగొండ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి మంత్రయ్యారు. ఇక ఆ తర్వాత అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషించారు. అప్పట్లో పరిటాల రవి కక్షసాధింపు చర్యలకు దిగుతారని శత్రువులు భయపడ్డారు.
అయితే ఆయన అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. చంద్రబాబు హయాంలోనూ ఆయనకు పార్టీలో సముచిత స్థానం దక్కింది. 1997లో పరిటాల రవి తన తండ్రి జీవిత కథ ఆధారంగా ‘శ్రీరాములయ్య’ చిత్రాన్ని నిర్మించడానికి సంకల్పించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో జరిగిన కారు బాంబు దాడిలో తీవ్రంగా గాయపడినా, ప్రాణాలతో బయటపడ్డారు. నసనకటలో తాను పునరుద్దరించిన ఆలయ ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి 550 జంటలకు సామూహిక వివాహాలు చేయించారు. 2004 ఫిబ్రవరిలో మరో 1,116 జంటలకు పెళ్లిళ్లు జరిపించి పేదలపక్షపాతిగా నిలిచిపోయారు.
2004లో టీడీపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత ప్రారంభించింది. రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్ మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది . ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నింటికీ సిద్ధం అయ్యారు. తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చారు.
చెర్లపల్లి జైల్లో ఉన్నకారు బాంబు నిందితుడు మద్దల చేరవు సూరితో అప్పటి సీఎం వైఎస్ కుమారుడు జగన్ తనను హత్య చేసేందుకు సెల్‌ఫోన్లో సంభాషణలు కొగిస్తున్నట్టు ఆరోపించారు. దాంతో పరిటాల మీద జగన్ పరువు నష్టం దావా వేశాడు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ ఆఫీసులో అనేక మంది అతిరథ మహారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సాయుధులైన అంగరక్షకులు ఉండగానే పరిటాల రవిపై ప్రత్యర్థులు గుళ్ల వర్షం కురిపించి హతమార్చారు.
దివంగత జననేత పరిటాల రవికి స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రాణం ఇచ్చే అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న పరిటాల రవి అస్తమించని సూర్యుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పటికీ ఆ‘పెనుగొండ పులి’ప్రజల హృదయాల్లో జీవిస్తునే ఉన్నారు.






.webp)


