Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంజాగుట్ట స్మశానవాటికలో పూడ్చిన శిశువు.. మరుసటి రోజు మాయం..!
posted on: Aug 11, 2026 10:31AM
.webp)
చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఆరు నెలలకే కవలలు జన్మించారు. దీంతో ఇంట్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అంతలోనే ఆ శిశులిద్దరినీ అనారోగ్యం కబళించింది. ఒక బిడ్డను కన్నీళ్లతో పూడ్చిపెట్టారు. మరుసటి రోజే రెండో బిడ్డ కూడా మృతి చెందడంతో.. రెండు మృతదేహాలను ఒకేచోట ఖననం చేద్దామని స్మశానవాటికకు వచ్చారు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్‌కు గురిచేసింది. మొదట పూడ్చిన తమ బిడ్డ మృతదేహం అక్కడ కనిపించలేదు!
పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ దంపతులకు కవలలు జన్మించారు.కానీ ఆరు నెలలకే జన్మించిన ఆ కవల శిశువులు అనారో గ్యంతో మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పంజా గుట్ట స్మశానవా టికకు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది రూ.2,500 తీసుకుని మృతదేహాన్ని ఖననం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఒక బిడ్డ చనిపోయిందన్న విషా దంలో ఉండగానే... మరుసటి రోజే రెండో శిశువు కూడా కన్నుమూ సింది. దీంతో ఆ బిడ్డను కూడా తీసుకుని కుటుంబ సభ్యులు పంజాగుట్ట స్మశానవాటికకు చేరుకు న్నారు.ముందురోజు ఖననం చేసిన తమ శిశువు ఉన్నచోటే రెండవ శిశువు ఖననం చేయాల నుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా మొదట ఖననం చేసిన శిశువు మృతదేహం అక్కడ కనిపించలేదు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మా బిడ్డ మృత దేహం ఎక్కడ అని కుటుంబ సభ్యులు స్మశానవాటిక సిబ్బందిని నిలదీశారు. “మా బిడ్డను ఇక్కడే పూడ్చాం..ఇప్పుడు మృతదేహం లేదు... ఏమైంది?” అంటూ ప్రశ్నించారు.
తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు.అయినా కూడా స్మశాన వాటిక సిబ్బంది నోరు మెదపలేదు. ఇద్దరు కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు.. ఒక బిడ్డను పూడ్చిన చోటే మృతదేహం కనిపించక పోవడం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అనంతరం ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు.
స్మశానవాటిక సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.అసలు శిశువు మృతదేహం ఎలా మాయమైంది. ఖననం చేసిన తర్వాత ఎవరైనా మృతదేహాన్ని బయటకు తీశారా?స్మశానవాటిక సిబ్బంది నిర్లక్ష్యమా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా?*అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నబిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు.. ఇప్పుడు తమ బిడ్డ మృతదేహం కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం పలువురి హృదయాలను కలచివేస్తోంది.
Panjagutta Cemetery, babys body disappeared, Charminar, Banjara Hills Police, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy


.webp)



