Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం.. నిక్స్ ఛాంపియన్‌షిప్ వేడుకల వేళ పేలిన తుపాకులు!
posted on: Jun 19, 2026 9:25AM

అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కూడలి గురువారం (జూన్ 18) ఒక్కసారిగా రణరంగంగా మారింది. అంతవరకు ఎంతో ఉల్సాహంగా సాగిన సంబరాల వాతావరణం క్షణాల వ్యవధిలో భయానకంగా మారిపోయింది. కారణం అక్కడ ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుళ్లు. న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు ఏకంగా 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మకమైన బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంతో లోయర్ మాన్‌హట్టన్ ప్రాంతంలో నగర చరిత్రలోనే నిలిచిపోయేలా ఒక భారీ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించారు. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
అయితే.. ఆ సంబరాలు ముగిసిన గంటల వ్యవధిలోనే.. టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. నల్లని దుస్తులలో ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానగా మారింది. కాల్పులకు దారితీసింది. ఆ ఇద్దరూ తుపాకులతో కాల్పులకు తెగబడటంతో అక్కడ ఉన్న వేలాది మంది భయాందోళనలకు లోనయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి జనం మధ్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


.webp)



