Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెమటలు పట్టిస్తున్న పనామా పేపర్స్
posted on: Apr 6, 2016 11:08AM

పనామా పేపర్స్ ప్రజంట్ ఈ పేరు వింటే చాలు సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ప్రముఖులకు చెమటలు పడుతున్నాయి. ఏ క్షణంలో ఎవరి ముసుగు తొలగిపోతుందో..ఎవరి భండారం బయట పడుతోందోనని బడా బాబుల గుండెలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లా పరిగెడుతున్నాయి. మొసాక్ ఫోన్సెకా అనే న్యాయసేవల సంస్థ నుంచి లీక్ అయిన కోట్లాది పత్రాలు ప్రపంచంలోని అనేక మంది కుబేరుల సంపాదనను బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఈ సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశాధినేతల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు ఈ పనామా దెబ్బకి విలవిలలాడిపోతున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ , నవాజ్ షరిఫ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ తదితరులు జాబితాలో ఉన్నారు. అయితే వీరు ఆ వార్తలన్నీ తూచ్ మాకేం సంబంధం లేదు. మేము చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామంటూ నీతివాక్యాలు చెబుతున్నారు. ఇప్పటికే దీని దెబ్బకి ఐర్లాండ్ పీఠం కదిలింది విదేశీ కంపెనీల్లో మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారని బయటపడటంతో ప్రధాని సిగ్ముండర్ డేవిడ్ గున్లాగ్సన్ రాజీనామా చేశారు. ఆయన గద్దె దిగాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ఐస్‌ల్యాండ్ పరిమితమయ్యేలా కనిపించడం లేదు. చిలీ అధ్యక్షుడు గొంజాలో డెలివియు, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకో,నైజీరియా అధ్యక్షుడు బుకోలా సరాకీ ఇలా ప్రపంచాన్ని కనుసైగతో శాసించే వారంతా బ్లాక్ మనీ బాధితులే అని తేలడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. వీరిపై ప్రజల్లో ద్వేష భావం కలగడానికి ముందే వీరంతా నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.
ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే నల్లధనాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశంగా ఇప్పటికే భారత్‌కి పేరుంది. ఇప్పుడు దీని వల్ల దేశానికి కొత్తగా వచ్చిన మచ్చంటూ ఏమి లేకపోయినా మనం మంచి వారని అనుకుంటున్న వారంతా నల్లకుబేరులని తెలిసే సరికి సగటు భారతీయుడు విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. పనామా పేపర్స్ మరికొంత మంది పేపర్లు విడుదల చేయడానికి రెడీ అవుతోంది. దీంతో నల్ల కుబేరులు ఎవరా అని ప్రజలు..ఎక్కడ గుట్టు బయట పడుతుందోనని బడా బాబులు కిందా మీద పడుతున్నారు.





