Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డీ లిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వాచాలత్వం.. తీవ్రంగా ఖండించిన ఇండియా
posted on: Apr 18, 2026 6:35AM
భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు 2026 పై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. భారత పరిపాలనా నిర్ణయాలు, వ్యవహారాల్లో తలదూర్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమంటూ పాక్ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ పేర్కొన్నారు.
ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఘాటుగా స్పందించారు. భారత పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు, నిర్ణయాలపై వ్యాఖ్యానించే నైతిక హక్కు పాకిస్థాన్‌కు లేదని విస్పష్టంగా చెప్పారు. వాస్తవానికి, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత దేశంలో అంతర్భాగమేనని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోందని గుర్తు చేశారు.






