Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అదే మనకూ..వాళ్లకు తేడా..!
posted on: Oct 4, 2016 7:34PM

భారత్, పాకిస్థాన్ పేర్లతో పాటు వేష, భాషల్లో, వ్యక్తుల మనస్తత్వాల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శత్రువైనా సరే ఆపదలో ఉంటే రక్షించే మనస్తత్వం మనది. యుద్ధ ఖైదీలతో పాటు తెలిసో , తెలియకో సరిహద్దు దాటి మన భూభాగంలోకి అడుగుపెట్టిన వారిని పెద్ద మనసుతో మానవతా దృక్ఫథంతో తిరిగి కన్నవారికి అప్పగించిన ఘన చరిత్ర మనది..కాని పాక్ ఇందుకు పూర్తి విరుద్ధం..యుద్ధ ఖైదీలను కానీ సరిహద్దులను దాటి వచ్చిన పౌరులను కాని ఏనాడు సజావుగా అప్పగించిన పాపాన పోలేదు పాక్. చిత్రహింసలు పెట్టి..శరీర అవయవాలు పీకి దారుణంగా చంపి శవాలను కూడా సరిహద్దుల్లో పాడేసిన చెండాలపు చరిత్ర పాక్‌ది.
తాజాగా పాకిస్థాన్‌కూ, మనకూ తేడా తెలిపే ఘటన ఒకటి వెలుగు చూసింది. తాగు నీటి కోసం వెతుక్కుంటూ..అనుకోకుండా మనదేశ భూభాగంలోకి ప్రవేశించిన 12 ఏళ్ల పాక్ బాలుడిని తిరిగి ఆ దేశానికి అప్పగించింది. పాక్‌లోని కసూర్ జిల్లా ధరి గ్రామానికి చెందిన మహ్మద్ తన్వీర్ అనే బాలుడు దాహం తీర్చుకోవడానికి..ఓ గొట్టపుబావి నుంచి తాగునీటిని వెతుక్కుంటూ మొన్న సాయంత్రం అంతర్జాతీయ సరిహద్దును దాటి మనదేశ భూభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ బలగాలు బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం పాక్ రేంజర్లను బీఎస్ఎఫ్ అధికారులు సంప్రదించి..మానవతా దృక్పథంతో బాలుడిని వారికి అప్పగించారు.
ఇక పాక్ సంగతి చూస్తే అనుకోకుండా సరిహద్దును దాటి గతవారం పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సైనికుడిని ఆ దేశం ఇంకా తన అదుపులోనే ఉంచుకుంది. మహారాష్ట్రకు చెందిన బాబూలాల్ చవాన్ అనే సైనికుడు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకుని జమ్మూకశ్మీర్‌లోని మెందర్ ఎల్‌వోసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కొత్తగా విధుల్లో చేరడంతో సరిహద్దులపై పూర్తి అవగాహన లేదు..దీంతో దారి తప్పి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాడు.
అయితే ఇరువైపులా కాపలా కాస్తున్న జవాన్లు దారి తప్పిపోవడం తిరిగి వారి సొంతదేశానికి తిరిగి రావడం ఎప్పుడూ జరిగేదే. అయితే ఉరి ఘటనకు ప్రతీకారంగా భారత్ పీవోకేలో సర్జికల్ స్ట్రక్స్ నిర్వహించి 40 మంది ముష్కరులను హతమర్చడంపై పాక్ రగిలిపోతోంది. అందుకే పట్టుబడిన జవానును ఇంతవరకు తిరిగి అప్పగించలేదు. కాని సర్జికల్ దాడులు నిర్వహించడం..ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తాజా పరిస్థితిలోనూ బాలుడిని అప్పగించి భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది.


.jpg)



