పాక్ లో నీటి సంక్షోభం ఆ దేశ స్వయంకృతాపరాధమే.!

posted on: Aug 8, 2026 5:54PM

పాకిస్థాన్ లో  నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాగు, సాగు నీటి కొరతతో జనంనానా అవస్థలుపడుతున్నాయి.  అయితే ఈ నీటి ఎద్దడికి కారణమైన తన పాలనా వైఫల్యాలను అంగీకరించకుండా పాకిస్థాన పాలకులు నెపం ఇండియాపై నెట్టేస్తోంది.  అయితే పాకిస్థాన్ లో తీవ్ర నీటి కొరతకు కారణాలేమిటన్నది..   కెనడాకు చెందిన  జియోపొలిటికల్ మానిటర్ నివేదిక కుండబద్దలు కొట్టేసింది.  పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి   భారత్  కారణం పూర్తిగా ఆ దేశ స్వయంకృత అపరాధమేననీ విస్పష్టంగా పేర్కొంది. మితిమీరిన అవినీతి, ప్రణాళికా రాహిత్యం, అంతర్గత రాజకీయ కుమ్ములాటల కారణంగానే పాకిస్థాన్ లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడిందని ఆ నివేదిక తేల్చేసింది.  తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ పాలకులు నెపంఇండియాపై నెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విస్పష్టంగా పేర్కొంది.  దాచుకోవడానికి పాక్ పాలకులు భారత్‌పై విషప్రచారం సాగిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.

 పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో జరిపిన  దాడిలో 26 మంది ఇండియన్ సిటిజన్స్  ప్రాణాలు కోల్పోయారు. ఈ  ఘటన తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు పూర్తిగా నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టంగా ప్రకటించింది.  ఇప్పుడు పాకిస్థాన్ ఆ విషయాన్నే ఎత్తి చూపుతూ ఇండియాకు వ్యతిరేకంగా తమ దేశ పౌరులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ప్రపంచ దేశాల ముందు భారత్ దుందుడుకు చర్య కారణంగా దేశంలో నీటి సంక్షోభం ఏర్పడిందని బాధితురాలిగా సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుననది. 

నిజానికి పాకిస్థాన్ నీటి కొరతకు సింధు జలాల ఒప్పందం తాత్కాలిక నిలిపివేత కారణం కాదనీ, ఆ దేశ అంతర్గత అవినీతే కారణం. ఈ విషయానని ఈ ఓప్పందం తాత్కాలిక నిలిపివేతకు సంవత్సరాల ముందే  పాకిస్థాన్ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది.   2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్  జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు   పొంతనే లేకపోవడం గమనార్హం.

పాకిస్థాన్ లోని అంతర్గత ప్రాంతీయ అసమానతలు కూడా ఈ నీటి సంక్షోభాన్ని మరింత పెంచాయి. సింధు జలాల ఒప్పందం కుదిరినప్పటి నుంచి పాకిస్థాన్ కొత్త డ్యామ్‌ల నిర్మాణంపై విపరీతమైన ఆసక్తి చూపింది. అయితే ఈ డ్యామ్‌లు, ప్రాజెక్టులు ప్రధానంగా సైన్యానికి పట్టున్న పంజాబ్ ప్రావిన్స్‌కే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. దీనివల్ల పంజాబ్ వంటి ఎగువ ప్రావిన్సులు నీటిని అడ్డుకుంటూ, దిగువన ఉన్న సింధ్ ప్రావిన్స్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. వైఫల్యం,  డ్యామ్ ల నిర్వహణా లోపాలు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నది వాస్తవం కాగా, దానిని కప్పిపుచ్చి ఇండియాపై నిందలు వేస్తున్న పాకిస్థాన్ కపటయత్నాలను  జియోపొలిటికల్ మానిటర్  నివేదిక బహిర్గతం చేసింది. 

Pakistan water crisis report, Indus Waters Treaty suspension, Geopolitical Monitor Pakistan report, Pahalgam attack India Pakistan

google-ad-img
    Related Sigment News
    • Loading...