Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీహార్‌లోనూ పాక్ జెండా రెపరెపలు..
posted on: Jul 22, 2016 5:19PM

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న పెద్దల మాట ప్రకారం..జన్మనిచ్చిన తల్లి, పుట్టిన గడ్డ స్వర్గం కంటే గొప్పవి.. ఈ విషయాన్ని మరచి కొందరు దుర్మార్గులు పరాయి దేశం అందునా శత్రుదేశంపై మమకారం పెంచుకుంటున్నారు. ఈ దేశపు మట్టిపై నిలబడి..ఇక్కడి గాలి పిలుస్తూ..ఇక్కడి నీరు తాగుతూ సిగ్గు లేకుండా మనదేశంపై అణువణువునా విషం చిమ్మే పాకిస్థాన్ జెండాను ఎగురవేస్తున్నారు. కశ్మీర్‌లో వేర్పాటు వాద నేతల అనుచరులు చాలా సార్లు పాక్ జెండాలతో పాటు శతృదేశానికి జై కొడుతున్నారు.
కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆమన మద్ధతుదారులు శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్, ఐఎస్, లష్కరే తోయిబా వంటి జెండాలు ప్రదర్శించారు. అలా వీలు చిక్కినప్పుడల్లా జెండాలు ఎగురవేస్తూనే ఉన్నారు. ఈ విష సంస్కృతి కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఆ జాడ్యం మిగతా రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. బీహార్‌లోని సుప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయం కొలువైన బిహార్ షరీఫ్‌లోని ఖరడికాలనీలోని ఒక ఇంటిపై పాకిస్థాన్ జెండాను పోలిన పతాకం ఎగురుతోందన్న వార్తలతో అధికారులు పరుగులు తీశారు.
అన్వరుల్‌హక్ అనే వ్యక్తి ఇంటిపై పచ్చని రంగు జెండాపై చంద్రుడు, అర్థచంద్రాకృతితో కూడిన పతాకం ఎగురుతున్న దృశ్యం వివిధ ఛానెళ్లలో ప్రసారమైంది. రంగంలోకి దిగిన పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి ఆ గ్రామానికి వెళ్లి జెండాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మన ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై మొద్దు నిద్ర పోతుంటే..విరాట్ కోహ్లీ విరాభిమాని అయిన పాక్ జాతీయుడు అతని ఆట తీరుకు ముగ్ధుడై తన ఇంటిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పాక్ ప్రభుత్వం అతన్ని ఖైదు చేసింది. ఆ దేశాన్ని స్పూర్తిగా తీసుకుని మన ప్రభుత్వం కూడా తల్లిపాలు తాగే రొమ్ము గుద్దే సన్నాసులను అణచివేయాలి.






